BEL Recruitment 2022|Project/Trainee Engineer|All India Eligible|B.Tech Or BE|Bharat Electronics

 

నిరుద్యోగులకు అలర్ట్.. బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ అర్హతతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

 

 

ప్రముఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క బెంగళూరు క్యాంపస్ లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే, కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ గా ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ మరియు ట్రైనీ ఆఫీసర్స్ గా ఎంపికైన వారు మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

 

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

మొత్తం 247 ఖాళీలను భర్తీ చేస్తుండగా.. ఇందులో 67 ప్రాజెక్ట్ ఇంజనీర్, 169 ట్రైనీ ఇంజనీర్, 11 ట్రైనీ ఆఫీసర్స్ ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసి ఉండాలి.

ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

40

మెకానికల్ ఇంజనీరింగ్

14

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

9

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

2

సివిల్ ఇంజనీరింగ్

2

 

ట్రైని ఇంజనీర్: బీఈ, బీటెక్. బీఎస్సీ, బీఆర్క్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు కనీసం ఆరు నెలలు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

104

మెకానికల్ ఇంజనీరింగ్

50

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

8

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

7

ఆర్కిటెక్చర్

1

 

ట్రైనీ ఆఫీసర్: ఈ విభాగంలో 11 ఖాళీలు ఉన్నాయి. రెండేళ్ల ఎంబీఏ ఫైనాన్స్ కోర్సు చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఆరేళ్ల అనుభవం ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే..

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://www.bel-india.in/Default.aspx) ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం కెరీర్ విభాగంలో Recruitment-Advertisement ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 3: తర్వాత Project Engineer 1, ట్రైనీ ఇంజనీర్ 1, ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్)-1 అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.

Step 4: ఇందులో మీరు కావాల్సిన ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 5: అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.

Step 6: అనంతరం భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.

 

Notification Link : Click Hear 

Post a Comment

0 Comments