bsf tradesman new vacancy 2022 | bsf tradesman notification 2022 telugu | BSF Constable Tradesman Recruitment 2022

 

నిరుద్యోగులకు అలర్ట్.. 2788 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో ఉద్యోగం చేయాలని భావించే యువతకు శుభవార్త. తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు(Jobs) అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

BSF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఖాళీ వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య- 2788

అర్హతలు:

అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం లేదా ఒకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ITIలో 1 సంవత్సరం డిప్లొమా ఉండాలి.

BPNL Recruitment 2022: అలర్ట్.. BPNLలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో 7875 జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

Physical Standard:

ఎత్తు: పురుషులు- 167.5 సెం.మీ, స్త్రీలు- 157 సెం.మీ.

ఛాతీ (పురుషులకు మాత్రమే): 78-83 సెం.మీ.

షెడ్యూల్డ్ కులాలు / తెగలు / గిరిజనులు..

ఎత్తు: పురుషులు-162.5 సెం.మీ మరియు స్త్రీ-155 సెం.మీ.

ఛాతీ (పురుషులకు మాత్రమే): 76-81 సెం.మీ.

కొండ ప్రాంతాల అభ్యర్థులు..

ఎత్తు: పురుషుడు 165 సెం.మీ మరియు స్త్రీ -150 సెం.మీ.

BEL Recruitment 2022: BELలో నెలకు రూ.55 వేల వేతనంతో జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

వయో పరిమితి:

అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం:

ఎంపికైన అభ్యర్థులకు వేతనంగా రూ.21,700-రూ.69,100 చెల్లించనున్నారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 15 జనవరి 2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 28 ఫిబ్రవరి 2022

Online Learning Apps: విద్యార్థులకు అలర్ట్.. ఈ యాప్స్ లో అన్ని తరగతుల వారికి, ఉద్యోగాలకు బెస్ట్ కోచింగ్

అప్లికేషన్ ఫీజు: ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. వెనుకబడిన తరగతులకు ఉచితం

ఎలా అప్లై చేయాలంటే:

అభ్యర్థులు ఈ లింక్ ద్వారా పోస్ట్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.

 అప్లై చేసే పూర్తి విదానం కొరకు ఈ వీడియొ చూడండి 👇👇👇

 

Post a Comment

0 Comments