Railway Recruitment 2022: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త.. 756 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.
నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే (Indian Railways) శుభవార్త చెప్పింది. 756 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Railway Jobs Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
ఇండియన్ రైల్వే (Indian Railways) నుంచి ఇటీవల అనేక ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు (Railway Jobs) విడుదల అవుతున్నాయి. జోన్ల వారీగా ఖాళీల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల చేస్తున్నారు. తాజాగా ఈస్ట్ కోస్ట్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అర్హతల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 756 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా https://www.rrcbbs.org.in/ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో LINK FOR ACT APPRENTICE - 2021-22 APPLICATION ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: అక్కడ పేరు, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
Step 5: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
0 Comments