దిగ్గజ ఐటీ కంపెనీ
అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) ఉద్యోగాలు కోరుకునే
మహిళలకు గుడ్ న్యూస్. టీసీఎస్ టెక్ హైరింగ్ ఫర్ వుమెన్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్
దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ బ్రేక్
తీసుకున్న మహిళలకు మరో అవకాశం ఇస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండేళ్లకు
పైగా అనుభవం ఉన్నవారిని నియమించుకుంటోంది. టీసీఎస్ టెక్ హైరింగ్ ఫర్ వుమెన్ ప్రొఫెషనల్స్ (TCS Tech Hiring
For Women Professionals) పేరుతో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్
నిర్వహిస్తోంది. కొత్తగా కెరీర్ ప్రారంభించాలనుకునేవారు లేదా పలు కారణాల వల్ల
కెరీర్ బ్రేక్ తీసుకున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (BFSI), టీసీఎస్ కమ్యూనికేషన్స్, మీడియా
అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో ఉద్యోగ అవకాశాలు ఇస్తోంది. మొత్తం 42 రకాల పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి 2022 ఏప్రిల్ 23 చివరి తేదీ.
TCS Jobs for Women:
టీసీఎస్ భర్తీ చేస్తున్న 42 రకాల
పోస్టులు ఇవే...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- ఆసక్తి గల
మహిళలు https://ibegin.tcs.com/iBegin/register వెబ్‌సైట్
ఓపెన్ చేయాలి.
Step 2- ఐటీ, బీపీఓలో
ఏదైనా ఆప్షన్ ఎంచుకోవాలి.
Step 3- మెయిల్ ఐడీ
ఎంటర్,
పాస్వర్డ్, పేరు, ఇతర
వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 4- రెజ్యూమ్
అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
సంబంధిత విభాగంలో విద్యార్హతలతో పాటు రెండేళ్లకు పైగా అనుభవం
ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన
తర్వాత టీసీఎస్ నుంచి అభ్యర్థులకు సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే టీసీఎస్
స్మార్ట్ హైరింగ్ 2022, ఎంబీఏ హైరింగ్ 2022, ఆఫ్
క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022, అట్లాస్ హైరింగ్ 2022
ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
0 Comments