TTD JOBS 2022 NOTIFICATION | 10TH PASS TTD JOBS NOTIFICATION 2022 |

 TTD Recruitment 2022: తిరుమలలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.54,060 వరకూ జీతం..


 TTD అధ్యర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు

 TTD Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్ధానం అధ్యర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో గోశాల మేనేజర్ 3 ఖాళీలు, డెయిరీ అసిస్టెంట్ 6 ఖాళీలు ఉన్నాయి.

గోశాల మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి వెటర్నరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 54, 060 వేతనం చెల్లిస్తారు. డెయిరీ అస్టిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన పోస్టును అనుసరించి పదవతరగతి, రెండేళ్ల యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.29, 980 నుంచి 54,060 వరకు వేతనంగా చెల్లిస్తారు.

 అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 11, 2022 దరఖాస్తులకు చివరితేది. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; ది డైరెక్టర్, శ్రీ వెంకటేశ్వర కౌ ప్రొటెక్షన్ ట్రస్ట్, టిటిడి, చంద్రగిరి రోడ్, తిరుపతి-517502, ఆంద్రప్రదేశ్ చిరునామాకు పంపాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.tirumala.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

 Apply Link - Click Hear 

Video Link 




Post a Comment

0 Comments