జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | NHM Jobs Recruitment 2022 | AP Jobs





 జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, ఏలూరు జిల్లా, ఏలూరు.

నోటిఫికేషన్ సంఖ్య : 2/NHM/2021

 

తేదీ..05.2022

 పత్రికా ప్రకటన (Limited Notification)

 

శ్రీయుత కమిషనర్, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్, ఎన్.హెచ్.యం., విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారము మరియు కలెక్టర్, ఏలూరు జిల్లా, ఏలూరు వారి ఆదేశముల ప్రకారము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఐక్య పశ్చిమ గోదావరి జిల్లా నందు National Health Mission స్కీమ్ నందు ఈ క్రింది తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానములో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కొరడమైనది అని తెలియచేయదమైనది.

 అర్హత గల అభ్యర్థులు https://westgodavari.ap.gov.in వెబ్ సైట్ నందు పొందు పరచిన దరఖాస్తు ను డౌన్ లోడ్ చేసుకుని, దరఖాస్తు తో పాటు తమ విద్యార్హతలు ఒక జిరాక్స్ సెట్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము, ఏలూరు నందు ది.14.05.2022 నుండి 17.05.2022 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయము పని దినములలో మాత్రమే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఏలూరు వారి కార్యాలయము నందు సంర్పించవలసినదిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా.బి రవి గారు తెలియ చేసినారు. జిల్లా వెబ్ సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత దృవపత్రములు జతచేయని యెడల మరియు ధరఖాస్తుల యందు ఖాళీలను పూరించని యెడల వారి ధరఖాస్తులను తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు పోస్టుల ఖాళీల సంఖ్య పెంచుటకు.. తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియమకాపు కమిటీ, పశ్చిమగోదావరి జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియచేయడమైనది.

 

గమనిక: 1. ఎంపిక కబడిన అభ్యర్ధులు ఒక సంవత్సర కాలము తప్పనిసరిగా విధులు నిర్వర్తించ గలమని

 హామీ పత్రము సంర్పించవలయును.

 1. ఈ యొక్క నోటిఫికేషన్ నందు నమోదు చేయబడిన రోస్టర్ కు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే వారియొక్క దరఖాస్తులు సమర్పించవలయును. అట్లు కనిచో ఆ యొక్క ధరకాస్తులు పరిగణన లోనికి తీసుకొనబడవని తెలియపరచడమైనది.

 పూర్తి వివరములకొరకు https://westgodavari.ap.gov.in మరియు https://eluru.ap.gov.in వెబ్ సైట్ నందు సందర్శించగలరు.

Notification - Click Hear 

Application Link - Click Hear  




Post a Comment

0 Comments