10 పాస్ అయితే 60 వేలు | Vidyadhan Online Registration | Vidyadhan Scholarship

 

విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం

సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్ధులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.





ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, రాష్ట్రాల నుంచి 5090 మంది విద్యార్ధులు లబ్ధిపొందారు. ఆంధ్రప్రదేశ్ లో 2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్ధులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్ధులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్ధులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.

"దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ (1st year) ప్రోగ్రామ్ 2022 పై క్లిక్ చేసి వివరాలు చూడగలరు".

 

A.P Intermediate (1st year) Programme 2022

స్కాలర్షిప్ వివరాలు :

2022 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2023 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.

విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం. లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్ధులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్ధులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.

 



కావలసిన పత్రాలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను

> 10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రొఫిషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు.

> ఫోటోగ్రాఫ్ (పాస్పోర్ట్ సైజ్ )

> 2022లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి) or ration card.

> దివ్యాంగుల - ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే )

> 10th July 2022 లోపు మీ విద్యాధాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇంటర్ కాలేజీ వివరాలు, పెట్టగలరు. లేనియెడల మీ అప్లికేషన్ అంగీకరించబడదు.

పైన తెలుపబడిన మొదటి మూడు పత్రాలు అప్లోడ్ చేసిన తరువాత మీ అప్లికేషన్ అంగీకరించబడుతుంది.

 

 


 

ఎవరు అర్హులు ?

విద్యార్ధుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2021-2022 విద్యాసంవత్సరంలో 10th (SSC/CBSC/ICSC) పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న వారు. విద్యార్ధి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాధించినవారు అర్హులు.

ఎంపిక విధానం:

 

విద్యార్ధి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని online లో పరీక్షకు /మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాల సమాచారం. విద్యార్ధులకు వ్యక్తిగతంగా email ద్వారా ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

 




ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:

 

1. విద్యార్థి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.

2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:

a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి.

b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి.



c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.

d. విద్యాధాస్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాస్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాస్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాస్ password మరిచి పొయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. అ Password తో login అవ్వవచ్చు.

3. "Apply Now " పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూంది.

4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Acount Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాధాన్ హోం పేజి లో Acount Activated అనే మెసేజ్ కనిపిస్తూంది.

5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు.

6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి.

7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత "Edit" పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు.


APPLY LINK - CLICK HEAR 

Post a Comment

0 Comments