appsc group jobs notification

 

APPSC AEE Jobs: BTech వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

 


APPSC AEE Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్‌ (సివిల్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్‌ 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

 

మొత్తం ఖాళీలు: 23

·         అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ రూరల్ వాటర్ సప్లయ్‌ అండ్ శానిటేషన్ ఇంజినీరింగ్ సర్వీస్‌): 13 పోస్టులు

·         అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ రోడ్స్ & బిల్డింగ్స్ ఇంజినీరింగ్ సర్వీస్‌): 03 పోస్టులు

·         అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్‌): 04 పోస్టులు

·         అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- మెకానికల్ (ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్‌): 01 పోస్టు

·         అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ సర్వీస్‌): 02 పోస్టులు

 

ముఖ్య సమాచారం:

·         అర్హతలు: బీఈ, బీటెక్‌ (సివిల్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.

·         వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

·         జీత భత్యాలు: రూ.57,100 – రూ.1,47,760.

·         ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్ - 1, పేపర్ - 2, పేపర్ - 3), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

·         దరఖాస్తు ఫీజు: రూ.370.

·         దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

·         దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 26, 2022.

·         ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్‌ 14, 2022.

·         ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 15, 2022.

·         పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://psc.ap.gov.in/

 

NOTIFICATION PDF LINK - CLICK HERE  

Post a Comment

0 Comments