జిల్లా కలక్టరు వారి కార్యాలయము, విశాఖపట్నం విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగముల భర్తీ కొరకు ప్రకటన
తేది.10-02-2022.
విశాఖపట్నం జిల్లా నందు వివిధ ప్రభుత్వ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు దివ్యాంగులకు కేటాయించబడిన ఈ క్రింద తెలియజేయబడిన బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. అభ్యర్థి వయస్సు ధరఖాస్తు చేసేనాటికి 18 సంవత్సరములు పైబడి ది. 01-07-2022 నాటికి 52 (42+10) సంవత్సరములు దాటి ఉండరాదు. ధరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది. 03-03-2022.
ఇతర ముఖ్య సూచనలు :
1) ఉద్యోగ ప్రకటన, సూచనలు మరియు ధరఖాస్తు నమూనా జిల్లా వెబ్ సైట్ https://visakhapatnam.ap.gov.in ద్వారా పొందవచ్చును.
లేదా కార్యాలయ పనివేళలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయము, రాణీ చంద్రమణీ దేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద వాల్తేర్,
విశాఖపట్నం
నందు పొందవచ్చును
2) పూర్తి చేయబడిన దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, రాణీ చంద్రమణీ దేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద వాల్తేర్ జంక్షన్, విశాఖపట్నం-530017 అను చిరునామాకు ది.03.03-2022 సాయంత్రం గం|| 5.00 లోపు స్వయంగా గాని లేదా పోస్టు ద్వారా గాని అందజేయవలెను. గడువు తేదీ తదుపరి అందిన ధరఖాస్తులు స్వీకరించబడవు.
3) పోస్టు ద్వారా అందడంలో జరిగిన జాప్యానికి జిల్లా పరిపాలనా యంత్రాంగము బాధ్యత వహించదు.
4) కవరు మీద ‘విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగము (గ్రూప్ కోడ్)
ఓపెన్ /మహిళ కొరకు' అని వ్రాయవలెను.
5) ఒకే గ్రూపులోని
పోస్టులకు వేరు వేరుగా ధరఖాస్తు చేయనవసరం లేదు.
6) మహిళలకు కేటాయించిన
పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేయవలెను. మరియు దరఖాస్తులో మహిళ వద్ద (*)
మార్కు చేయవలెను. అట్లు చేయని దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకొనబడదు.
7) అర్హతను బట్టి వేరు
వేరు గ్రూపులకు, వేరు వేరుగా
దరఖాస్తు చేసుకొనవచ్చును.
8) ధరఖాస్తుతో పాటు
స్వయం ధృవీకరణ చేసిన 1) పుట్టిన తేదీ
ధృవపత్రం, 2) సదరం వైద్య ధృవీకరణ పత్రం, 3) విద్యార్హతల ధృవీకరణ పత్రములు 4) ఎంప్లాయిమెంట్ కార్డు,
5) 1వ
తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ
సర్టిఫికెట్లు
9) కనీస విద్యార్హత / సాంకేతిక విద్యార్హతలకు
సంబంధించిన మార్కుల ధృవీకరణ పత్రములు తప్పని సరిగా జతపరచవలెను.
10) శారీరక మరియు
ధృష్టిలోపం గలవారైతే వైకల్య శాతం కనీసం 40 శాతం ఉండవలెను.
బధిరుల విషయములో కనీస వైకల్యం 75 శాతం కలిగి ఉండవలెను.
వైకల్య శాతం స్పష్టంగా ఉన్న వైద్య ధృవపత్రం మాత్రమే అంగీకరించబడును.
11) ప్రభుత్వ నియమ
నిబంధనల ప్రకారము ఎంపిక కాబడిన అభ్యర్థులు వైకల్య ధృవీకరణ కొరకు అప్పిలేట్ మెడికల్
బోర్డుకు పంపడానికి నియామక కమిటీకి అధికారం కలదు.
12) ఈ ప్రకటనలో చూపబడిన
ఉద్యోగ ఖాళీల సంఖ్య సుమారుగా చూపబడింది. చూపబడిన ఖాళీల సంఖ్య పెరగవచ్చును లేదా
తగ్గవచ్చును.
13) ఈ ప్రకటనలో చూపబడిన
పోస్టులు/ఖాళీలు రద్దు చేయుటకు లేదా ఈ ప్రకటనను పూర్తిగా రద్దు చేయుటకు జిల్లా
పరిపాలనా యంత్రాంగమునకు పూర్తి అధికారం కలదు.
14) ధరఖాస్తు చేసినంత
మాత్రాన ఉద్యోగ నియామక విషయములో ఎటువంటి గ్యారంటీ లేదు.
15) అభ్యర్థుల ఎంపిక
కొరకు వ్రాత పరీక్షగాని మౌఖిక ఇంటర్యూ గాని ఉండవు.
16) అర్హత లేని మరియు
అసంపూర్తి ధరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు.
17) అభ్యర్థులు వారి
వైకల్య తరగతికి చెందిన ఉద్యోగములకు మాత్రమే అర్హులు.
19) ఇది వరకే ప్రభుత్వ
ఉద్యోగులైన అభ్యర్థులు ఈ ప్రకటననుసరించి ధరఖాస్తు చేయదలచినచో సంబంధిత అధికారి
అనుమతి పత్రముతో మాత్రమే ధరఖాస్తు చేసుకోవలెను. లేని యెడల ధరఖాస్తు
తిరస్కరించబడును.
Notification Link - Click Hear
0 Comments