SSC MTS 2022: టెన్త్‌ అర్హతతో 3603 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.75,000ల వరకు జీతం

 



SSC 3603 MTS Havaldar Jobs: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి

SSC MTS Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ (Multi-Tasking Staff and Havaldar Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3603 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే మల్టీ టాస్కింగ్‌ - నాన్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఖాళీల వివరాలు ఇంకా ప్రకటించలేదు కాబట్టి పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 30 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు 
https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. ముఖ్య సమాచారం:

·         మొత్తం ఖాళీల సంఖ్య: 3603 (మల్టీ టాస్కింగ్‌ -నాన్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఖాళీల వివరాలు ఇంకా ప్రకటించలేదు)

·         అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

·         పే స్కేల్‌: నెలకు రూ.31,000ల నుంచి రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

·         వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

·         ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

·         దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

·         దరఖాస్తు రుసుము:

·         జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.100

·         ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు:

·         దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022

·         ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 2, 2022

·         చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 3, 2022

·         కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (టైర్‌ 1) తేదీ: జులై, 2022

·         రాత పరీక్ష (టైర్‌ 2) తేదీ ఇంకా ప్రకటించలేదు.


పూర్తి వివరాలకు ఇక్కడ
 క్లిక్‌ చేయండి:

అప్లై చేయు విదానం కొరకు ఇక్కడ క్లిక్‌ చేయండి:

Post a Comment

0 Comments