TSLPRB TS Police Recruitment Notification 2022 | TS Police Notification 2022 |

 

TSLPRB TS Police Recruitment Notification 2022: తెలంగాణలో 16,614 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 16,027 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.






ఇక ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మే 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలకు 
https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. TSLPRB Recruitment 2022- విద్యార్హతలు:

·         35వ నెంబర్ పోస్టుకు 10 తరగతితో పాటు వైర్‌మెన్ లేదా మెకానిక్ మోటార్ వెహికిల్ లేదా మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ పాసై ఉండాలి.

·         36వ నెంబర్ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. లేదా పదవ తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ మోటార్ వెహికిల్ మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్‌లో ఐటీఐ పాసై ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ లేదా హెచ్ఎంవీ లైసెన్స్ ఉండాలి.

·         విద్యార్హతల విషయానికొస్తే.. పోస్టులను బట్టి వేర్వేరు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఎస్సై పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. 2022 జూలై 1 లోగా పరీక్ష పాసై ఉండాలి.

·         34వ నెంబర్ పోస్టుకు పదవ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు ఎలక్ట్రానిక్, మెకానిక్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటనెన్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి.

కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలివే:

·         సివిల్ కానిస్టేబుల్స్ - 4965

·         ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423

·         ఎస్ఏఆర్ సీఎల్ – 100

·         టీఎస్ఎస్‌పీ – 5010

·         స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్ – 390

·         విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ - 610

·         జైళ్ల శాఖ(పురుషులు) – 136

·         జైళ్ల శాఖ (స్త్రీలు )- 10

·         ఐటీ, క‌మ్యూనికేష‌న్ - 262

·         పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)- 21

·         పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) - 100

 Notification Link - Click Hear - 1 

 Notification Link - Click Hear - 2

Website link - Click Hear



Post a Comment

0 Comments